ETV Bharat / state

ఇంకా కుదుటపడని సచివాలయం పాలన

సచివాలయ పాలన ఇంకా కుదటపడలేదు. కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికారుల కార్యాలయాలు పాక్షికంగా తరలినా... విభాగాల తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

సచివాలయం పాలన
author img

By

Published : Aug 24, 2019, 5:44 AM IST

Updated : Aug 24, 2019, 10:30 AM IST

ఇంకా కుదుటపడని సచివాలయం పాలన

కొత్త సచివాలయ నిర్మాణం కోసం వీలైనంత త్వరగా ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాలను యుద్ధప్రాతిపదికన తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు గతంలోనే స్పష్టం చేశారు. పక్షం రోజుల క్రితం సీఎస్ జోషి సహా ఇతర అధికారులు హడావుడిగా తమ కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్​కు తరలించారు. కార్యాలయాన్ని తరలించినప్పటి నుంచి సీఎస్ సచివాలయంలోని తన కార్యాలయానికి రావడం లేదు. బీఆర్కే భవన్​లో తన కార్యాలయం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం వల్ల కుందన్ బాగ్​లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

శ్రీకారం చుట్టిన జయేశ్ రంజన్...

సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బీఆర్కే భవన్ నుంచే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. జపాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సచివాలయ సంబంధిత సమావేశాలకు జయేశ్ శ్రీకారం చుట్టారు. మిగతా కార్యదర్శులు, అధికారులు లాంఛనంగా బీఆర్కే భవన్​లో కార్యాలయాలు ప్రారంభించినప్పటికీ.. కార్యకలాపాలను మాత్రం సచివాలయం నుంచే కొనసాగిస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు, విభాగాల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. సచివాలయంలో మూటగట్టిన దస్త్రాలు, ఇతరాలను బీఆర్కే భవన్​లో ఇంకా సర్దుబాటు చేయలేదు. అక్కడ ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. కనీస వసతులు లేకుండా తాము విధులు ఎలా నిర్వహిస్తామని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అమాత్యుల కార్యాలయాలు...

మంత్రుల కార్యాలయాల తరలింపు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం తమ కార్యాలయాలను శాఖాధిపతుల కార్యాలయాలకు తరలించి అక్కణ్నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మిగతా మంత్రుల కార్యాలయాల తరలింపు జరగాల్సి ఉంది. మంత్రులందరికీ బీఆర్కే భవన్​లోని మొదటి అంతస్తులో కేటాయింపు చేశారు. అమాత్యులెవరూ అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ప్రభుత్వ ముఖ్యసలహాదారు, సీఎంవో కార్యదర్శుల కార్యాలయాలను బేగంపేటలోని మెట్రో రైల్ భవన్​కు తరలించాలని నిర్ణయించారు. అక్కడ ఇంకా అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ మరమ్మతులు పూర్తయ్యాయని అంటున్నారు. సోమవారం నుంచి ఆయన అక్కణ్నుంచే విధులు నిర్వహించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: కన్నయ్య బర్త్​డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్​!

Last Updated : Aug 24, 2019, 10:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.