పట్టణాల్లోని సమస్యలను పరిష్కారించే దిశగా 'పట్టణ ప్రగతి' కార్యక్రమాన్ని ప్రభుత్వం ధైర్యంగా చేపట్టిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రెండో విడత పట్టణ ప్రగతిలో భాగంగా సుమారు రూ. 5 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మేయర్ జక్కా వెంకరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రాజకీయాలకు చోటు లేకుండా అన్ని కాలనీలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని... మాస్కులు తప్పనిసరిగా ధరించాలని... రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా నివారణ చర్యల్లో రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : చిరకాల స్వప్నం.. మూణ్నెల్లలో సాకారం!