ETV Bharat / state

Sheep Distribution: నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ - second phase of sheep distribution

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జీవాల పంపిణీకి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

second
గొర్రెల పంపిణీ
author img

By

Published : Jul 28, 2021, 4:52 AM IST

కరోనా కారణంగా రాష్ట్రంలో నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీ (Sheep Distribution)కి మార్గం సుగుమమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జీవాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

జిల్లాల్లోనూ పంపిణీ...

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ఇతర జిల్లాల్లో కేటాయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడతలో రాష్ట్రంలో 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)... 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఒక గొర్రెల యూనిట్ ధర గతంలో లక్షా 25వేల రూపాయలుండగా... పెరిగిన ధరలు, లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు దానిని లక్షాల 75 వేలకు పెంచారు.

సుమారు 6 వేల కోట్లు వెచ్చించి...

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8వేల 109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7లక్షల 61వేల 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించగా... 4వేల 702కోట్ల 78 లక్షల రూపాయల ఖర్చు చేసి 3లక్షల 76వేల 223 యూనిట్ల గొర్రెలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా రెండో విడత కింద 3లక్షల 81వేల మంది లబ్ధిదారులకు సుమారు 6 వేల కోట్ల రూపాయల వ్యయం వెచ్చింది. గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదారణకు గురైన కుల వృత్తుల్లో నేడు వెలుగులు నింపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు కోటి 37లక్షల గొర్రె పిల్లలు జన్మించడం ద్వారా గొల్ల, కురుమలకు 6వేల 850 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: Green India Challenge: ఫిలింసిటీలో మొక్కలు నాటిన అమితాబ్​, నాగార్జున

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.