ఒడిశా నుంచి రాష్ట్రానికి మరో 60.23 టన్నుల ద్రవ (లిక్విడ్) ఆక్సిజన్ వచ్చింది. నాలుగు ట్యాంకర్లలో సనత్‌నగర్‌లోని గూడ్స్ కాంప్లెక్స్‌కు మంగళవారం చేరుకుంది. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసిన 2వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ ప్రాణవాయువు రాష్ట్రానికి అందింది. తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌తో మే 2న 124.26 టన్నుల ప్రాణవాయువు వచ్చిన విషయం తెలిసిందే. రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన నాలుగు ఖాళీ ట్యాంకర్లతో 118.75 టన్నులు తీసుకురావాలనుకున్నారు. కానీ అందులో సగమే వచ్చింది.
ఈ ఆక్సిజన్‌ను ‘గాంధీ’ తదితర అవసరమున్న ఆస్పత్రులకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి సనత్‌నగర్‌కు 1334 కి.మీ. దూరం. రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఖాళీ ట్యాంకర్లతో సనత్‌నగర్ నుంచి ఏప్రిల్ 29న బయల్దేరింది. ఒడిశాలోని అనుగుల్‌లో ఆక్సిజన్ నింపుకొని మంగళవారం మధ్యాహ్నం సనత్‌నగర్ చేరుకుంది. అక్కడ ప్రారంభ స్టేషన్ నుంచి బయల్దేరాక గమ్యం చేరుకునేందుకు 31 గంటల సమయం పట్టింది. రైలు సగటు వేగం 43 కి.మీ. ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: అమెరికాలో సిక్కుపై సుత్తితో నల్ల జాతీయుడి దాడి