హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమాఖ్య జాతీయ సహ సమన్వయకర్త అనీస్ జెండాను ఆవిష్కరించారు.
తెరాస ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకన్య ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పర్యాయంలో మహిళలకు కేబినేట్లో స్థానం కల్పించకపోవడం విచారకరమని అన్నారు. ప్రస్తుత కేబినేట్లో ఒక మహళకు మాత్రమే ప్రాధాన్యత కల్పించి... అధికారాలను ఆయన వద్దే ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కూడా రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం బాధాకరమని సుకన్య విచారం వ్యక్తం చేశారు. జాతీయ మహాసభలు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇవీ చూడండి: రఫేల్పై సుప్రీం తీర్పు.. పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం