రైళ్లలో రద్దీ పెరగడంతో రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో 4 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.
సికింద్రాబాద్ -విశాఖపట్నం (నెం.12783/12784).. వారానికి ఓ రోజు, లింగంపల్లి- కాకినాడ టౌన్ (నెం.12775/12776) వారానికి మూడు రోజులు.. విశాఖపట్నం - తిరుపతి (నెం.22707/22708) డబుల్ డెక్కర్ రైలు వారానికి మూడు రోజులు.. సికింద్రాబాద్ - షాలిమార్ (నెం.12773/12774) వారానికి ఓ రోజు నడవనున్నాయి.
తాజాగా ప్రకటించిన 39 రైళ్లలో 18 ఏసీ ఎక్స్‌ప్రెస్‌లు, 8 శతాబ్ది రైళ్లు, 4 డబుల్ డెక్కర్, 4 ఏసీ దురంతో, 3 రాజధాని, 1 యువ ఎక్స్‌ప్రెస్, 1 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి.
ఇదీ చదవండి: లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి