ETV Bharat / state

'వారందరికీ అందేంతవరకు పల్స్​ పోలియో కార్యక్రమం' - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా 'పల్స్‌ పోలియో' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తొలిచుక్కలు వేసి.. కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో 23 వేలకు పైగా కేంద్రాల్లో... ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరోనా కారణంగా గతంలో దీనిని వాయిదా వేసిన ప్రభుత్వం... తీవ్రత తగ్గటంతో తిరిగి ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ, వైద్యారోగ్య సిబ్బంది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించటంతో తొలిదశలో విజయవంతంగా ముగిసింది.

pulse program
'వారందరికీ అందేంతవరకు పల్స్​ పోలియో కార్యక్రమం'
author img

By

Published : Jan 31, 2021, 7:24 PM IST

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేంత వరకూ రాష్ట్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో 38 లక్షల 31వేల 907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం 23వేల 331 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరో 877 మొబైల్ టీంలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

కందుకూరులో సబితా..

రంగారెడ్డి జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రెండు చుక్కలు పోలియో బారి నుంచి చిన్నారులను కాపాడుతాయని అన్నారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కేంద్రాన్ని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.

ఆరోగ్యంగా ఎదిగేందుకు..

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పోలియో చుక్కలు వేశారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో కార్యక్రమాన్ని మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. గర్భిణులు, బాలింతల సంరక్షణతో పాటు... చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

ఖమ్మం ఇందిరానగర్‌ ఉన్నత పాఠశాలలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. నిర్మల్‌ బస్టాండ్​లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పల్స్‌ పోలియోను ప్రారంభించారు. హైదరాబాద్ కవాడిగూడలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్​, కరీంనగర్‌ గౌతమినగర్​ పీహెచ్​సీలో మేయర్‌ సునీల్​రావు, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, జగిత్యాల జిల్లా ఖిలాగడ్డ వద్ద ఎమ్మెల్యే సంజయ్‌ పోలియో చుక్కలు వేశారు. భూపాలపల్లి పీహెచ్​సీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నల్గొండ జిల్లా హాలియాలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ప్రారంభించారు.

ఇవీచూడండి: నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.