ETV Bharat / state

బడ్జెట్‌ బెత్తెడు... భారం బండెడు - GHMC Election Budget Latest News

మహానగర పీఠం కోసం పార్టీల పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా హామీలిచ్చాయి. నగరపాలిక బడ్జెట్ అంచనాలకు మించి వాగ్దానాల వర్షాన్ని కురిపించాయి. ఉచిత తాగునీటి సరఫరా, నాలాల విస్తరణ, ప్రజారవాణాలో ఉచిత ప్రయాణాలు, పేదలకు గృహాలు, ఆర్థికసహాయాల పేరిట తాయిలాలు ప్రకటించాయి. ఈ హామీల విలువ జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.

GHMC
బడ్జెట్‌ బెత్తెడు... భారం బండెడు
author img

By

Published : Nov 28, 2020, 8:10 AM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీల హామీలను అమలు చేయాలంటే నగరపాలిక బడ్జెట్‌ కంటే దాదాపు 10 నుంచి 20 రెట్ల సొమ్ము అవసరం. జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం పన్నుల ఆదాయం, ప్రభుత్వ గ్రాంట్లు కలిపి రూ.5600 కోట్ల మేర బడ్జెట్‌ ఉంది. ఇందులో ఫీజులు, యూజర్‌ ఛార్జీలు, ఇతర ఆదాయం రూ.3571 కోట్లు వస్తోంది. పరిపాలన ఖర్చుల కింద రూ.2414 కోట్లు అవుతోంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే రూ.3186 కోట్లతో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తోంది. ఈ స్థితిలో నిధులు చాలక బస్తీల్లో పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపాలు సరేసరి.

ముఖ్య హామీల్లో దేనికెంత?

తెరాస : పది లక్షల కుటుంబాలకు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు, సమగ్ర వరదనీటి కాలువల కోసం రూ.12 వేల కోట్లు, మూసీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. మెట్రో, బీఆర్‌టీఎస్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హామీ అమలుకు కనీసం రూ.20 వేల కోట్లు కావాలని అంచనా. సొంత స్థలాలున్న పేదవారు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయాలంటే కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగురోడ్డు నిర్మిస్తామన్నది తెరాస ఇచ్చిన మరో ముఖ్య వాగ్దానం.

తెరాస

భాజపా : భాజపా హామీల అమలుకు కనీసం రూ.40 వేల కోట్లు అవసరమని ఆ పార్టీ అంతర్గతంగా అంచనా వేసింది. ఉచిత కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.25 వేల చొప్పున రూ.1600 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇస్తామని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ సౌకర్యాలు, విద్యార్థులకు ట్యాబ్‌లకు రూ.1700 కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. మూసీ సుందరీకరణ, నాలాల అభివృద్ధి, వరదనీటి కాలువలకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీలో 28 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వివరించింది. 20 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ) నిర్మాణానికి కనీసం రూ.1500 కోట్లు అవసరమని అంచనా.

భాజపా

కాంగ్రెస్‌ : కాంగ్రెస్‌ హామీల్లో వరద బాధిత కుటుంబాలకు సాయం కింద రూ.50 వేల చొప్పున 6.5 లక్షల మంది బాధితులకు రూ.3250 కోట్లు కావాలి. నాలాల విస్తరణ, గోడల నిర్మాణం, భూగర్భ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు రూ.10 వేల కోట్ల వరకు అవసరం. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, దివ్యాంగులకు బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణ హామీ ఇచ్చింది. మెట్రోరైలు సేవల విస్తరణ హామీకి కనీసం రూ.15 వేల కోట్లు అవసరమని భావిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.8 లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది. ఈ ఒక్క హామీని కనీసం లక్ష మందికి అమలు చేసినా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. విద్యుత్తు రాయితీ, ఉచిత నీటి సరఫరా, కొవిడ్‌ నిరుద్యోగ భృతికి రూ.4 వేల కోట్లు కావాలి. కిర్లోస్కర్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామన్నది కాంగ్రెస్‌ ఇచ్చిన మరో హామీ. ఇందుకోసం రూ.25 వేల కోట్లు అవసరమని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది.

కాంగ్రెస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.