ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో 28 జడ్జిల పోస్టులు ఖాళీ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో 10, ఏపీలో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో 28 జడ్జిల పోస్టులు ఖాళీ
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో 28 జడ్జిల పోస్టులు ఖాళీ
author img

By

Published : Mar 18, 2021, 10:16 AM IST

తెలంగాణ హైకోర్టులో 10, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 18 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకు 19 మంది... తెలంగాణ హైకోర్టులో 24 మందికి 14 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఉన్నత న్యాయస్థానానికి.. 2019లో ఇద్దరు, తెలంగాణలో ముగ్గురు, 2020లో ఏపీకి ఏడుగురు, తెలంగాణలో ఒకరి నియామకం జరిగినట్లు చెప్పారు.

సుప్రీం కోర్టులోనూ 4 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల్లో కలిపి 39 % న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో 2020లో 97, తెలంగాణలో 96 న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: వారికి తరగతులు కొనసాగించాలా..? వద్దా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.