దిశ ఘటనలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఘటనాస్థలంలో పోలీసులు బాధితురాలి సెల్‌ఫోన్‌ను గుర్తించారు. దిశ సెల్‌ఫోన్‌తో పాటు ఆమె ఇతర వస్తువులను నిందితులు భూమిలో పాతిపెట్టారు. ఘటన జరిగిన 500 మీటర్ల పరిధిలో భూమిలో పాతిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో మరిన్ని ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తోంది.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు.... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే నివేదిక కేసులో కీలకం కానుంది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కానున్న తరుణంలో విచారణ వేగవంతమవుతుంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును న్యాయస్థానానికి వీలైనంత తొందరలో ఇచ్చేందుకు దర్యాప్తు బృందం కృషి చేస్తోంది.