పగలు రెక్కీ చేసి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 కేసులు ఉన్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు గత నెలలో మీర్‌పేటలో అనుమాన్పదంగా కనిపిస్తున్న ఇద్దరిని ప్రశ్నించగా పోలీసులపై పెప్పర్ స్ప్రే కొట్టి పరారవడానికి ప్రయత్నించారు.
చాకచక్యంగా వీరిని పట్టుకున్న పోలీసులు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి 47.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామాగ్రి, ఒక ఎయిర్ పిస్టల్, టీవీ, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని మారణాయుధాలతో బెదిరించి తప్పించుకుంటున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'మిస్ టీన్ ఇండియా-2020'గా మన్నత్ కౌర్