Theft cases in Telangana : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మాజీ డీజీపీ ఆనందయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, డాలర్లు, నగదు తస్కరించి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు గాలిస్తుండగానే నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో మరో దొంగతనానికి పాల్పడి అక్కడి పోలీసులకు నిందితుడు చిక్కాడు. సొత్తు రికవరీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
Theft in Jagtial today : జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 29 సెల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి ఎస్పీ చేతుల మీదుగా తిరిగి అందజేశారు. పోయిన వెంటనే పొగొట్టుకున్న పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. సాంకేతిక సాయంతో సెల్‌ఫోన్‌ను గుర్తించి పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
పుస్తెల తాడుతో పరార్ : ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఖమ్మం జిల్లా కందుకూరు చెందిన మల్లా వేంకటేశ్వర రావు వ్యసనాలకు అలవాటై దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. కేసుని 24 గంటల్లో చేధించినట్లుగా తెలిపారు.
"మహిళ ఒంటరిగా ఉందని తెలిసి నిందితుడు దొంగతనం చేశాడు. ఈ విషయం మేము తెలుసుకొని చుట్టు పక్కల వారే చేసి ఉంటారనే అనే కోణంలో దర్యాప్తు చేశాం. అదే నిజం అయింది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వెంకటేశ్వర్లు ఈ దొంగతనం చేశాడని తేలింది. అతను ఆమె ముఖంలో శనగ పిండి కొట్టి మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కొని వెళ్లాడు. అతని పై అనుమానంతో విచారించగా నిజాలు తెలిశాయి." -శ్రీనివాస్ రావు, డీసీపీ బాలానగర్ జోన్
మేడ్చల్‌లో 20 తులాల బంగారం చోరీ : మేడ్చల్ జిల్లా కాప్రా ప్రధమపురి కాలనీలో పెద్దమొత్తంలో చోరి జరిగింది. తిరుమల గిరిలో పాన్ బ్రోకర్ దుకాణం నిర్వహిస్తున్న కరణ్ ముఖర్జీ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 8 లక్షల నగదు, 20 తులాల బంగారంతో పాటు ఒక లాకర్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్ పేటలోని ఓ రీసార్ట్‌కి వెళ్లి వచ్చేలోగా దొంగతనం జరిగినట్లుగా కరణ్ ముఖర్జీ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: