ETV Bharat / state

పాసుల కోసం తగ్గిన దరఖాస్తులు... ఎందుకంటే..?

సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ పాసుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటుచేసిన తొలినాళ్లలో రోజుకు 23 వేలకు పైగా దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

the-number-of-people-applying-for-passes-to-their-home-states-is-gradually-decreasing-in-telangana
పాసుల కోసం తగ్గిన దరఖాస్తులు... ఎందుకంటే..?
author img

By

Published : May 11, 2020, 8:02 AM IST

లాక్‌డౌన్‌ అంతకంతకూ పొడిగిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి సులభంగా పాసులు జారీచేసేందుకు డీజీపీ కార్యాలయం ఇటీవల ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేసింది. సహేతుక కారణం చూపిస్తూ దరఖాస్తు చేసుకుంటే గంటల వ్యవధిలోనే పాసులు పొందే సదుపాయం కల్పించింది. ఈ నెల 4 నుంచి ఇది అందుబాటులోకి రాగా.. ఒకేసారి 23వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోవడం వల్ల ఆ రోజు సాయంత్రం 4.20 గంటలకు సర్వర్‌ స్తంభించింది.

రెండోరోజు సైతం మరో 23వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సరైన కారణం చూపించిన వారందరికీ పాసులు ఇచ్చారు. ప్రస్తుతం రోజుకు 10-15 వేల వరకూ పాసులను జారీ చేస్తుండటం వల్ల క్రమంగా దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు 15 వేల దరఖాస్తులు వస్తున్నాయి.

పాసుల కోసం మొత్తం 70 వేలకుపైగా దరఖాస్తులు రాగా వాటిలో అత్యధికంగా వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చి చిక్కుకొని పోయినవారే ఉన్నారు. వీరి సంఖ్య 20 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు పాసులు జారీ చేస్తున్నప్పటికీ సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వాటిని ఆమోదించడం లేదు. అత్యవసర సందర్భాల్లోనే పాసులను అనుమతిస్తున్నారు.

ఇవీచూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.