ETV Bharat / state

New Judges to High court: నేడే హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం - హైకోర్టు నూతన న్యాయమూర్తులు

New Judges to High court: హైకోర్టు నూతన న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ఉదయం 9 గంటల 45 నిమిషాలకు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టులో జడ్జిల సంఖ్య సీజేతో కలిపి 29కి చేరనుంది.

High Court will be sworn in today
29కి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య
author img

By

Published : Mar 24, 2022, 5:15 AM IST

Updated : Mar 24, 2022, 6:46 AM IST

New Judges to High court: రాష్ట్ర హైకోర్టుకు కేటాయించిన 10 మంది న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ఉదయం 9 గంటల 45 నిమిషాలకు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణం చేయించనున్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి గతంలోనే సిఫారసు చేసింది.

New Judges to High court: ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులుగా కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, ఎన్‌.వి. జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.వి శ్రావణ్‌కుమార్​, జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజ్‌ నాగార్జున్‌ ప్రమాణం చేయనున్నారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఇదీ చూడండి:

Last Updated : Mar 24, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.