ETV Bharat / state

ఖరీఫ్‌, రబీ పేర్లు రద్దు..వానాకాలం, యాసంగి ముద్దు - తెలంగాణ తాజా వార్తలు

ప్రస్తుతం ఉన్న ఖరీఫ్‌, రబీ పేర్లను రద్దు చేస్తూ వ్యవసాయశాఖ వెలువరించింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేర్లు ఉండాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయించారు.

The names of Kharif and Rabi canceled in telangana
ఖరీఫ్‌, రబీ పేర్లు రద్దు..వానాకాలం, యాసంగి ముద్దు
author img

By

Published : Apr 25, 2020, 7:42 PM IST

ఖరీఫ్‌, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేర్లు ఉండాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయించారు. ఇక నుంచి శాఖాపరమైన ఉత్తర్వులు, పత్రాల్లో వానాకాలం, యాసంగి పదాలనే వాడాలని ఉత్తర్వులను రూపొందించారు.

ఈ ఉత్తర్వులపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటి వరకు సామాన్యులకే కాకుండా చదువుకున్న వారికి ఖరీఫ్‌, రబీ పదాలను వాడే విషయంలో గందరగోళం నెలకొనేది. ఇక నుంచి వానాకాలం, యాసంగి పదాలనే ఉపయోగించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలకు సూచన చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చూడండి : సీఎం సహాయ నిధికి విరాళాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.