''నిన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమై మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్ఛా. నేడు మంత్రిగా నగరికి రావడం మీరిచ్చిన వరంగా భావిస్తానని'' మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టాక మొట్టమొదటగా నగరి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
‘ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్కగా నా సత్తా ఏమిటో చూపిస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నాకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టి పెడతానన్నారు. నిన్నటి వరకు ఇక రోజాకు సీటు రాదని, నా పని అయిపోయిందని ఎగతాళి చేసి మాట్లాడిన వారి నోర్లు మూయించే విధంగా ఇక్కడి ప్రజలు తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించార’న్నారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని, నా కంఠంలో ప్రాణమున్నంత మీ వెంటే ఉంటానన్నారు. 2024లోనూ జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, వార్ వన్ సైడేనని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: