ETV Bharat / state

TRS President Election 2021: తెరాస అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ షురూ.. నామినేషన్​ దాఖలు!

తెరాస అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ(TRS President Election 2021) లాంఛనంగా మొదలైంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న పరిశీలన, 24న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు తెరాస అధ్యక్షుడి(TRS President Election 2021) గా సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలైంది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులు నామినేషన్ దాఖలు చేశారు.

TRS President Election 2021
తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్
author img

By

Published : Oct 17, 2021, 12:25 PM IST

Updated : Oct 17, 2021, 12:54 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడి(TRS President Election 2021) గా సీఎం కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ మంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ తరఫున మంత్రులు మహమూద్​ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఇంద్రకరణ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్, శ్రీనివాస్​ గౌడ్​, జగదీశ్​ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్​ కుమార్.. ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డికి నామినేషన్ సమర్పించారు.

తెరాస రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నికకు పార్టీ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి షెడ్యూల్​ విడుదల చేశారు. ఈనెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న నామపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహకరణకు గడువు విధించారు. అనంతరం 25న హైటెక్స్​లో జరిగే ప్లీనరీలో సుమారు 14వేల మంది పార్టీ ప్రతినిధులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కేసీఆర్​ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదించగా.. మిగిలిన వారు బలపరిచారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రెండు దశాబ్దాల్లో తెరాస, ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్​లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నారు..

కేసీఆర్ దిశానిర్దేశం!

అదేవిధంగా నేడు పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్షాల సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హాజరై సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీ, నవంబరు 15న వరంగల్‌ విజయగర్జన సభ నిర్వహణ, పార్టీ పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు.

త్వరలో వరంగల్‌కు...

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన భారీ బహిరంగ సభకు అనువైన స్థలాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ఆదివారం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్​కు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో చర్చించి వేదికను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సభ ఏర్పాట్ల పరిశీలనకు కేటీఆర్‌ వరంగల్‌ వెళతారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: TRS President Election 2021: తెరాస అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం.. నేటి నుంచే నామినేషన్లు

Last Updated : Oct 17, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.