కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేయర్ రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ మంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు కేటీఆర్, ఈటల, శ్రీనివాస్‌గౌడ్.. మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఔషధాలు ఇళ్ల వద్దకే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి సూచించారు. శానిటైజేషన్, స్ప్రేయింగ్, ఫీవర్సర్వేలను ఎప్పటికప్పుడు చేపడుతూ తగు జాగ్రత్తల సూచనలను చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు