హైదరాబాద్ మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి. శనివారం టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ నాగోల్-హైటెక్ సిటీ రూట్లో అమీర్ పేట వద్ద గంట పాటు రైళ్లు నిలిచిపోగా.. ఇవాళ మళ్లీ అదే సమస్య తలెత్తింది. జూబ్లీహిల్స్ రోడ్ 5 స్టేషన్ లో మెట్రో రైల్ ఆగింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందని సిబ్బంది చెప్పారు. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రైళ్లు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం అయినందున ప్రయాణికులు మెట్రో తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గం చాలా రద్దీగా ఉంటుంది. ఈ రూట్లోనే పలుమార్లు సాంకేతిక సమస్యలు ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
ఇదీ చూడండి: రాజధానిలో మళ్లీ కొకైన్ కలకలం