ETV Bharat / state

బీఏసీ నుంచి టీఆర్‌ఎస్‌ను తొలగించిన లోక్‌సభ సచివాలయం - Lok Sabha Removed TRS from BAC

Lok Sabha Secretariat removed TRS from BAC బీఏసీ నుంచి లోక్‌సభ సచివాలయం టీఆర్ఎస్‌ను తొలగించింది. టీఆర్ఎస్ తరపున ఇప్పటివరకు బీఏసీ సభ్యుడిగా నామ నాగేశ్వరరావు ఉన్నారు. ఇవాళ్టి బీఏసీ భేటీకి ఆహ్వానితుడిగానే నామ నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. టీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో 9 మంది సభ్యులు ఉన్నా బీఏసీ నుంచి తొలగించింది.

The Lok Sabha Secretariat removed TRS from BAC
బీఏసీ నుంచి టీఆర్‌ఎస్‌ను తొలగించిన లోక్‌సభ సచివాలయం
author img

By

Published : Mar 1, 2023, 12:39 PM IST

Updated : Mar 1, 2023, 1:01 PM IST

Lok Sabha Secretariat removed TRS from BAC బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌) ను లోక్‌సభ సచివాలయం తొలగించింది. టీఆర్‌ఎస్‌ తరపున ఇప్పటివరకు బీఏసీ సభ్యుడిగా ఎంపీ నామ నాగేశ్వరరావు ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ్టి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీకి ఆహ్వానితుడిగానే నామ నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఇస్తారు. టీఆర్‌ఎస్‌కు లోక్‌ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్‌సభ సచివాలయం తొలగించింది. లోక్‌ సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్‌ఎస్‌ కొనసాగనుంది. లోక్‌ సభ బీఏసీ ఇకపై ఆహ్వానం పంపితేనే టీఆర్ఎస్‌ బీఏసీ భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌ను ఇంకా బీఆర్ఎస్‌గా లోక్‌సభ సచివాలయం గుర్తించలేదు.

ఇక టీఆర్ఎస్ పార్టీ... గత ఏడాది బీఆర్ఎస్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసి... బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది. అక్టోబర్ 5 వ తేదీన దసరా రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు.

ఇప్పటికే తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీని.. బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. టీఆర్ఎస్ ఎల్పీని... బీఆర్ఎస్ ఎల్పీగా కూడా మర్చారు. ఎన్నో ఆశయాలతో 21 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఒక్కో అడుగు వేసుకుంటూ.. ఈ స్థాయికి చేరుకుంది. స్వరాష్ట్రాన్ని సాధించేందుకు ఎన్నో పోరాటాలు చేసి... చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది.

హుస్సెన్ సాగర్ ఒడ్డున 2001 ఏప్రిల్ 27 వ తేదీన అతి తక్కువ మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది. అలా మెుదలైన పార్టీ.. స్వరాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించి... 13 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కేసీఆర్ బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకోగా... జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.