ETV Bharat / state

'న్యాయవాదులు ఆర్థికసాయం కోసం సర్కారుపై ఆధారపడొద్దు' - Telangana high court on lawers fiannce

న్యాయవాదులు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వంపై ఆధారపడవద్దని.. సొంతంగా నిధి సమకూర్చుకోవాలని హైకోర్టు తెలిపింది. ఆర్థిక సాయంపై దాఖలపైన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

Lawyers
ఆర్థికసాయం
author img

By

Published : Jul 7, 2021, 9:33 PM IST

న్యాయవాదులు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వంపై ఆధారపడవద్దని.. సొంతంగా నిధి సమకూర్చుకోవాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వేళ ఇబ్బంది పడుతున్న న్యాయవాదులకు రూ.50 వేలు, క్లర్కులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

స్వతంత్ర వృత్తిలో ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సాయం చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘాలదేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. సీనియర్ న్యాయవాదుల సహకారంతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కార్పస్ ఫండ్, అవసరమైన న్యాయవాదులకు పంపిణీ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్​కు సూచించింది. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో వివరాలు సమర్పించాలని బార్ కౌన్సిల్​ను హైకోర్టు ఆదేశించింది.

వీలైనంత త్వరగా చేపట్టండి...

సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఏపీపీల కొరతపై సుమోటోగా తీసుకున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ఏపీపీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని.. 263 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. ప్రక్రియ పూర్తి చేయడానికి సుమారు 9 నెలల సమయం సమజంసంగా లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పరీక్ష నిర్వహణకు 45 రోజులు.. మూల్యాంకనానికి 45 రోజులు, దరఖాస్తులను ఖరారు చేసేందుకు 30 రోజులు సమయం అవసరమా అని ప్రశ్నించింది. ప్రక్రియలో వివిధ దశల సమయాన్ని తగ్గించి.. తాజాగా నివేదిక ఇవ్వాలని పోలీసు నియామక సంస్థను హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: KISHAN REDDY : సహాయ మంత్రి నుంచి కేబినెట్​ మంత్రిగా కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.