ఇంట్లో మందలించారని ల్యాబ్ టెక్నీషియన్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో చోటు చేసుకుంది.
కొంతకాలంగా ..
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన యల్లమట్టి బెట్టీ ( 32 ) మియాపూర్‌లోని రెయిన్‌బో హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుంది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని .. హైదర్‌గూడలోని బాబాయి వసపోగు ఎజ్రా ఇంట్లో నివాసముంటుంది. ఉద్యోగం చేసే వద్ద ఓ వ్యక్తిని ప్రేమించినట్లు బెట్టి ఇంట్లో చెప్పింది. వారు పెళ్లికి నిరాకరించారు. ఇదే విషయమై కొంతకాలంగా ఇంట్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి.
రూమ్‌లోకి వెళ్లి చూడగా..
సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని వచ్చిన బెట్టి.. రాత్రి 11 గంటల సమయంలో ప్రేమించిన వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుంది. ఈ సమయం వరకు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావ్.. కట్ చేసి పడుకోమని పిన్ని కేథరిన్ ఎజ్రా మందలించింది. మరుసటిరోజు ఉదయం బెట్టీ రూమ్‌లోకి వెళ్లి చూడగా .. ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని .. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:'వేతనాల సవరణపై త్వరలోనే శుభవార్త'