ETV Bharat / state

ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు: కిసాన్​ కాంగ్రెస్

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు కిసాన్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ధాన్యం కల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు పేర్కొంది.

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​రెడ్డి

author img

By

Published : May 25, 2021, 10:41 PM IST

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయనున్నట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​రెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ధాన్యం కల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం చేపడతామని వివరించారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తాలు పేరిట రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని అన్వేష్​రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం ఉండటం లేదని మండిపడ్డారు. కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన లారీలు, గన్నీ బ్యాగుల సమస్యను పరిష్కరించి కొనుగోళ్లు జరపాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు అంచనాలు సిద్ధం చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.