ETV Bharat / state

ఐడబ్ల్యూఏ అవార్డుకు భారత్​ నుంచి దానకిశోర్

ప్రతిష్ఠాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోషియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డు జలమండలి ఎండీ దాన కిశోర్‌ను వరించింది. సుమారు 130దేశాల నామినేషన్‌లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్‌కు దాన కిషోర్ ఎంపికయ్యారు.

దానకిశోర్​ను వరించిన ఐడబ్ల్యూఏ అవార్డు
author img

By

Published : Aug 30, 2019, 12:04 AM IST

దానకిశోర్​ను వరించిన ఐడబ్ల్యూఏ అవార్డు

ఐడబ్ల్యూఏ డెవలప్‌మెంట్ అవార్డుకు భారత్‌ నుంచి హైదరాబాద్ జలమండలి ఎండీ దానకిశోర్​ ఎంపికయ్యారు. జల నాయకత్వం, జల సంరక్షణ కార్యక్రమం ద్వారా నీటి వృథాను తగ్గించడం, నీటి పునర్వినియోగం, నీటి సంరక్షణ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పన వంటి అంశాలను నామినేషన్‌ కోసం పంపారు. ఐడబ్ల్యూఏ సెక్రటెరియట్‌ నుంచి దానకిశోర్​ను అభినందిస్తూ సమాచారం వచ్చింది. అలాగే తుది ప్రజెంటేషన్‌ను సమర్పించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఏ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది వాటర్ డెవలప్​మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో సస్టైనబుల్ సొల్యూషన్స్​పై జరుగుతుంది.

ఇదీ చూడండి: రెవెన్యూపై దృష్టి పెట్టిన జలమండలి

TG_Hyd_66_29_IWA_Award_to_Dana_Kishore_AV_3182301 Reporter: Karthik Script: Razaq Note: జలమండలి ఎండీ దాన కిషోర్ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ప్రతిష్టాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోషియేషన్ ( ఐడబ్ల్యూఏ ) అవార్డు జలమండలి ఎండీ దాన కిషోర్‌ను వరించింది. ఐడబ్ల్యూఏ డెవలప్‌మెంట్ అవార్డుకు భారత్‌ నుంచి హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిషోర్ ను ఎంపిక చేశారు. జల నాయకత్వం, జల సంరక్షణ కార్యక్రమం ద్వారా నీటి వృధాను తగ్గించడం పునర్వినియోగం బోర్లు రీచార్జీ చేయడంపై దృషిసారించడంతో ప్రత్యేక చొరవతో నీటి సంరక్షణ అంశంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న అంశాలను ఈ అవార్డు నామినేషన్‌ కోసం పంపారు. సుమారు 130దేశాల నామినేషన్‌లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్‌కు దాన కిషోర్ ఎంపికయ్యారు. ఐడబ్ల్యూఏ సెక్రటెరియట్‌ నుంచి ఎండీని అభినందిస్తూ సమాచారం అందించారు. అలాగే తుది ప్రజెంటేషన్‌ను సమర్పించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఎ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం వాటర్ డెవలప్ మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ శ్రీలంకలోని కొలంబోలో 2019 డిసెంబర్ 1-5 నుండి సస్టైనబుల్ సొల్యూషన్స్ పై జరుగుతుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.