Pudding Pub case : బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మూడో రోజు ఇద్దరు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్‌లో లభ్యమైన మాదకద్రవ్యాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో అభిషేక్, అనిల్ తెలిపారు. ఈ కేసులో అభిషేక్ ఐఫోన్ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్ అనిల్‌కు డ్రగ్ విక్రేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకు అభిషేక్ భాగస్వామి అర్జున్ ఆచూకీ దొరకలేదు. ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్ దొరికితే మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పబ్‌పై రైడ్ చేసిన సమయంలో అర్జున్ కోల్‌కతాలో ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ రాజ్ అనే మరో భాగస్వామి అమెరికాలో ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. అభిషేక్ కాల్‌డేటా ఆధారంగా మరింత సమాచారం రాబట్టనున్నారు. నిందితుల యూపీఐ, బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఈ విచారణలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. నిందితులను నాలుగు రోజులు కస్టడీ తీసుకోగా.. రేపటితో ఆ గడువు ముగియనుంది.
ఇవీ చూడండి: Excise Dept On Pubs: పబ్‌ల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు.. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా
Hyderabad Pub Case: నిందితులపై తొలిరోజు ప్రశ్నల వర్షం.. కీలక సమాచారం సేకరణ!