ETV Bharat / state

బత్తాయిని మరికొన్ని రోజులు కాపాడుకునేలా ఉద్యానశాఖ సూచనలు - latest news on The horticulture instructions to save the batai for a few more days

బత్తాయి రైతులు తమ పంటను మరి కొన్ని రోజులు కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ పలు సూచనలు చేసింది. ఈ మేరకు నాగ్​పూర్​లోని జాతీయ బత్తాయి, నిమ్మ పరిశోధనా కేంద్రం వారి సహాయంతో ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి ఈ సిఫార్సులు జారీ చేశారు.

the-horticulture-instructions-to-save-the-batai-for-a-few-more-days
బత్తాయిని మరికొన్ని రోజులు కాపాడుకునేలా ఉద్యానశాఖ సూచనలు
author img

By

Published : Apr 19, 2020, 7:39 AM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బత్తాయి రైతులు తమ పంటను మరి కొన్ని రోజులు కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ పలు సూచనలు చేసింది. నాగ్​పూర్​లోని జాతీయ బత్తాయి, నిమ్మ పరిశోధనా కేంద్రం వారి సహాయంతో ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి ఈ సిఫార్సులు జారీ చేశారు. కోతకు ముందు పలు రసాయలనాలను 10 - 12 రోజుల వ్యవధితో పిచికారీ చేయటం ద్వారా సుమారు 30 - 40 రోజుల వరకు కోత ఆలస్యం చేయవచ్చని తెలిపారు. రంగు మారే దశను వాయిదా వేసి కొన్ని రోజులు పంట కోతను వాయిదా వేసుకునే వీలుంటుందని వెల్లడించారు.

రసాయనాలు పిచికారీ చేయు విధానం..

జిబ్బరిల్లిక్ ఆసిడ్​ను 15 పీపీఎం+యూరియా 1.5% కలిపిన ద్రావణాన్ని మొదటి పిచికారీ చేయాలి. 4-డి-15 పీపీఎం +1.5% పొటాషియం నైట్రేట్​తో రెండో పిచికారీ చేయాలి. జిబ్బరిల్లిక్ ఆసిడ్​ను 15 పీపీఎం+యూరియా1.5% + 0.1 % కర్బండిజమ్ కలిపిన ద్రావణాన్ని మూడో పిచికారీ చేయాలి. వీటితో పాటు చెట్లకు కాలానుగుణంగా నీళ్లందించాలని సూచించారు.

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బాష్పోత్సేక నివారిణి 6 కేజీలను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఒకవేళ పండ్లు పసుపు రంగుకు మారిఉంటే అలాంటి పండ్లను కోసి కోల్డ్ స్టోరేజ్​లో పెట్టాలని సూచించారు.

ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.