ETV Bharat / state

బ్యాడ్​ బాయ్స్​ బిలియనీర్స్​ డాక్యుమెంటరీని వీక్షించిన హైకోర్టు.. ఏమందంటే? - సత్యం రామలింగరాజు

సత్యం రామలింగరాజుపై చిత్రీకరించిన బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ డాక్యుమెంటరీ ఓటీటీ విడుదలపై నెట్​ఫ్లిక్స్​ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది. నెట్​ఫ్లిక్స్ సమర్పించిన లింక్ ద్వారా డాక్యుమెంటరీని వీక్షించినట్లు ధర్మాసనం పేర్కొంది. తప్పును ఒప్పుకుంటూ రామలింగరాజు రాసిన లేఖ ఆధారంగా డాక్యుమెంటరీకి పేరు పెట్టినట్లు ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

The High Court viewed the Bad Boys Billionaires documentary today
బ్యాడ్​ బాయ్స్​ బిలియనీర్స్​ డాక్యుమెంటరీని వీక్షించిన హైకోర్టు.. ఏమందంటే?
author img

By

Published : Sep 25, 2020, 4:56 PM IST

సత్యం రామలింగరాజుపై చిత్రీకరించిన బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ డాక్యుమెంటరీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్​రెడ్డి ధర్మాసనం వీక్షించింది. డాక్యుమెంటరీని ఓటీటీపై విడుదల చేయకుండా కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. నెట్​ఫ్లిక్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. నెట్​ఫ్లిక్స్ సమర్పించిన లింక్ ద్వారా డాక్యుమెంటరీని వీక్షించినట్లు ధర్మాసనం తెలిపింది.

తప్పును ఒప్పుకుంటూ రామలింగరాజు రాసిన లేఖ ఆధారంగా డాక్యుమెంటరీకి పేరు పెట్టినట్లు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సత్యం కేసులో ఇప్పటికే శిక్ష పడిందని.. వికీపీడియా వంటి జన బాహుళ్యాలలో ఉన్న అంశాల ఆధారంగానే డాక్యుమెంటరీ చిత్రీకరించినట్లు నెట్​ఫ్లిక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఈ విషయం రామలింగరాజుకు సైతం ముందే తెలుసని.. చివరి క్షణంలో డాక్యుమెంటరీపై కోర్టును ఆశ్రయించి.. ఏకపక్షంగా ఉత్తర్వులు పొందారని విన్నవించారు. డాక్యుమెంటరీకి ముందు అనుమతులు తీసుకోవాలనడం మంచి సంప్రదాయం కాదన్నారు. డాక్యుమెంటరీని అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని వాదించారు.

సత్యం కేసులో ఈడీ, ఐటీ, సెబీ విచారణ ఏ దశలో ఉందని నెట్​ఫ్లిక్స్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆ కేసుల వివరాలపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీచూడండి: ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.