తిరుమల తెప్పోత్సవాలలో ఆఖరి రోజున స్వామివారి నౌకా విహారం కన్నుల పండువగా సాగింది. శ్రీవారు ఆలయం నుంచి అమ్మవార్లతో తిరుచ్చి వాహనంపై మాఢవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు.
కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణగా విహరించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల సంకీర్తనల నడుమ... తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.