ETV Bharat / state

'నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోం' - దొడ్డిదారిన పదోన్నతులు

ప్రభుత్వం.. పోస్టులను దొడ్డిదారిన పదోన్నతులతో నింపుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్​. కృష్ణయ్య విమర్శించారు. ఉద్యోగ నియామకాల అంశంపై సీఎస్ సోమేశ్​కుమార్​తో చర్చించినట్లు తెలిపారు.

the govt was filling jobs with staggering promotions says R Krishnaiah
'పోస్టులను దొడ్డిదారిన పదోన్నతులతో నింపుతున్నారు'
author img

By

Published : Jan 29, 2021, 7:26 AM IST

నిరుద్యోగులకు అన్యాయం చేస్తే వదిలి పెట్టేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్​. కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాద్​, బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేశ్​కుమార్​తో కలిసి ఉద్యోగ నియామకాల అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై.. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్ పోస్టులను తగ్గిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. పోస్టులను దొడ్డిదారిన పదోన్నతులతో నింపుతున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్.. ఖాళీలన్ని భర్తీ చేస్తామని తెలపడం సంతోషకరమని కృష్ణయ్య పేర్కొన్నారు. మాట మీద నిలబడకపోతే.. పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.