ETV Bharat / state

ఏప్రిల్​ నెల పింఛన్​ 75 శాతం: ప్రభుత్వం ఉత్తర్వులు - ఏప్రిల్​ నెల పింఛన్​ 75 శాతం చెల్లించనున్న ప్రభుత్వం

ప్రభుత్వం ఏప్రిల్​ నెల పింఛన్​ను 75 శాతం చెల్లించనుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.

ఏప్రిల్​ నెల పింఛన్​ 75 శాతం: ప్రభుత్వం ఉత్తర్వులు

author img

By

Published : Apr 20, 2020, 8:03 PM IST

మంత్రివర్గ నిర్ణయంతో ప్రభుత్వం ఏప్రిల్ నెల పింఛన్​ను 75 శాతం చెల్లించనుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా సర్కార్ ఖజానాకు ఆదాయం పడిపోయినందున ఉద్యోగుల వేతనాలు, లబ్ధిదారులకు పింఛన్లలో కొంత మొత్తాన్ని గతంలో వాయిదా వేస్తున్నట్లే ఈసారి కూడా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మినహాయింపులు ఉన్న శాఖలు తప్ప మిగతా శాఖల్లోని ఆయా స్థాయిల్లోని ఉద్యోగులకు నిర్ణీత శాతం వేతనాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.

ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.