ETV Bharat / state

BHAGAVANTHRAO: 'గణేశ్​ నిమజ్జనం విషయంలో ప్రభుత్వం రివ్యూ పిటిషన్​ వేయాలి'

గణేశ్​ నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్​ వేయాలని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పేర్కొన్నారు. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జనం సాఫీగా సాగేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు.

BHAGAVANTHRAO: 'గణేశ్​ నిమజ్జనం విషయంలో ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి'

author img

By

Published : Sep 11, 2021, 5:16 PM IST

భగవంతుడిని పూజించడం.. నిమజ్జనం చేయడం ప్రజల హక్కని భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పేర్కొన్నారు. గణేశ్​ నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భగవంత్ రావు సూచించారు.

ఈ సందర్భంగా గణేశ్​ విగ్రహాలతో నీరు కలుషితం అవుతుందనేది ఎక్కడా రిపోర్టులో లేదని భగవంత్​రావు స్పష్టం చేశారు. నాలాల కలుషిత నీటితోనే హుస్సేన్‌సాగర్ నీరు కలుషితం అవుతుందన్నారు. గణేశ్​ నిమజ్జనం ద్వారా హుస్సేన్‌సాగర్‌ కలుషితం అవుతుందని ఎవరు తేల్చారని భగవంత్‌రావు ప్రశ్నించారు. రసాయన విగ్రహాల ద్వారా నీరు కలుషితం అవుతందని ఎక్కడా రిపోర్టుల్లో లేదన్నారు. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు సమర్పించారని ఆయన ఆరోపించారు. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..

ముఖ్యమంత్రి కేసీఆర్​ కాశీం రజ్వీలా ప్రవర్తిస్తున్నారని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మండిపడ్డారు. ఇలా చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు..

Ganesh Immersion: నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలు.. తలలు పట్టుకున్న అధికారులు

HIGH COURT: 'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.