ETV Bharat / state

ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి: ఉత్తమ్​కుమార్​రెడ్డి - uttam kumar reddy

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ.5 వేలు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా మంచి బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు లేవంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అంత అహంకారం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

the-government-should-give-500-to-every-family-uttam
ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి: ఉత్తమ్​కుమార్​రెడ్డి
author img

By

Published : Apr 30, 2020, 1:26 PM IST

Updated : Apr 30, 2020, 2:06 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ.5 వేలు అందించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి డిమాండ్​ చేశారు. 80 శాతం మంది రేషన్ బియ్యం తినడం లేదని.. వేరే బియ్యం కొనుగోలు చేసి తింటున్నారని వ్యాఖ్యానించారు. రేషన్ దుకాణాల ద్వారానే మంచి బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రంలోని దీపం లబ్ధిదారులందరికి ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని ఉత్తమ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు ఆందోళనగా ఉన్నారని.. సహాయ చర్యలు పెంచాలని సూచించారు.

కందులు, మొక్కజొన్న డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పసుపు, బత్తాయి, నిమ్మ, మామిడిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేపట్టాలన్నారు.

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా ఉన్నాయని ఉత్తమ్‌ ఆరోపించారు. పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కరోనా మృతులకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవంటూ సీఎం అహంకారంతో మాట్లాడుతున్నారని, అది మంచిది కాదని అన్నారు.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల

Last Updated : Apr 30, 2020, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.