పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయుధ లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిధిలో ఆయుధాల లైసెన్సులపై సస్పెన్షన్ విధించారు.
మొత్తం 21 జిల్లాల కలెక్టర్ల పరిధిలో లైసెన్సులు సస్పెండ్ చేశారు. లైసెన్సుదారులు వారి ఆయుధాలను పోలీసులు, ఆయుధాల డీలర్ల వద్ద జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి : కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు