ETV Bharat / state

LAND POOLING: భూసమీకరణ విధానం అమలుకు సిద్ధమవుతోన్న సర్కార్..!

LAND POOLING: సరైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి, ఆవాసాల ఏర్పాటే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. వివిధ రకాల భూములను సమీకరించి.. అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేసి ప్రణాళికాబద్ధమైన ఆవాసాలే లక్ష్యంగా ల్యాండ్​ పూలింగ్​, మానెటైజేషన్ విధానాన్ని అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణ ప్రాంతాల్లో 2వేల ఎకరాల వరకు గుర్తించారు. ప్రభుత్వ విధానపర నిర్ణయం అనంతరం భూ సమీకరణ కార్యాచరణ చేపట్టనున్నారు.

LAND POOLING: భూసమీకరణ విధానం అమలుకు సిద్ధమవుతోన్న సర్కార్..!
LAND POOLING: భూసమీకరణ విధానం అమలుకు సిద్ధమవుతోన్న సర్కార్..!
author img

By

Published : Feb 19, 2022, 5:25 AM IST

Updated : Feb 19, 2022, 6:42 AM IST

LAND POOLING: భూసమీకరణ విధానం అమలుకు సిద్ధమవుతోన్న సర్కార్..!

LAND POOLING: పట్ణణ ప్రాంతాల ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పాటు ఆర్థిక స్వయం సమృద్ధి లక్ష్యంగా భూములను సమీకరించి.. అభివృద్ధి చేసే కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ల్యాండ్​ పూలింగ్, మానెటైజేషన్ విధానంలో భూములు సమీకరించి.. అభివృద్ధి చేసే దిశగా సిద్ధమవుతోంది. హెచ్​ఎమ్​డీఏతో పాటు నగర పాలికలు, జిల్లా కేంద్రాల్లో ఆ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

ల్యాండ్​ లూపింగ్​ విధానం అమలు అవకాశాలు అన్వేషించడం సహా విధి విధానాలు రూపొందించాలన్న రాష్ట్ర మంత్రివర్గ ఆదేశాల మేరకు పురపాలక శాఖ గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ల్యాండ్​ పూలింగ్​పై జరిగిన ప్రత్యేక కార్యశాలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్​కు.. వివిధ రాష్ట్రాల్లోని భూ సమీకరణ విధానం, ఇతర విధానాల రూపకల్పన సహా అక్కడ వచ్చిన ఫలితాలను అధికారులు వివరించారు. ప్రణాళికబద్ధ ఆవాసాల నిర్మాణంలో.. గుజరాత్, మహారాష్ట్ర అభివృద్ధి చేసిన విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. అక్కడి విధానాలు, అనుభవాల ఆధారంగా.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముంబైలోని ధారవి, గుజరాత్​లోని అహ్మదాబాద్, సూరత్​ వంటి ప్రాంతాల్లో అమలు చేసినట్లుగా రాష్ట్రంలో భూ సమీకరణకు ప్రత్యేక విధానం తీసుకు రావాలని ప్రతిపాదించారు. అవసరమైతే.. ప్రత్యేక చట్టాన్ని తేవాలని సూచించారు.

ముందుగా కొన్నిచోట్ల.. తర్వాత అన్నిచోట్లా..

రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్​ఎమ్​డీఏ పరిధిలో మాత్రమే ల్యాండ్​ పూలింగ్​ విధానంలో ప్రాజెక్టులు చేపట్టారు. ఇటీవలే లేమూరు, ఇన్ముల్​నర్వ, దండుమైలారం బోగారంలో 565 ఎకరాల విస్తీర్ణంలో భూ సమీకరణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హెచ్​ఎమ్​డీఏ పరిధితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లోనూ ల్యాండ్​ పూలింగ్​ ప్రాజెక్టులు చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముందుగా కొన్ని చోట్ల ఈ విధానాన్ని అమలు చేసి.. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కనీసం 20 పట్టణాల్లో ఆ విధానంలో ల్యాండ్​ పూలింగ్​ విధానాన్ని చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

భూములకు విలువ పెరుగుతుంది..

మొదట నగర పాలికలు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తే బాగుంటుందన్న భావనతో ప్రభుత్వం ఉంది. అవకాశమున్న చోట ప్రభుత్వ భూములు, ఆ తర్వాత అసైన్డ్ సహా ఇతర సమస్యలున్న భూములను ఇందుకు వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ప్రైవేట్ భూములను ఈ విధానంలో తీసుకొని అభివృద్ధి చేస్తే.. అందులో 60 శాతం యజమానులకు ఇస్తారు. ల్యాండ్​ పూలింగ్​ విధానంలో భూ సేకరణ, న్యాయపర ఇబ్బంది ఉండబోవని... ప్రభుత్వం నుంచి భారీగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. సరైన మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారని అంటున్నారు. భూ యజమానులు భాగస్వాములుగా ఉండడంతో న్యాయపర చిక్కులకు ఆస్కారం ఉండదని... వారి భూములకు విలువ పెరుగుతుందని చెబుతున్నారు.

పలు జిల్లాల్లో భూముల గుర్తింపు..

భూ సమీకరణ దిశగా ఇప్పటికే పలు జిల్లాల్లో భూములను గుర్తించినట్లు సమాచారం. అవకాశం ఉన్న చోట భూములను సమీకరించి వాటిని ప్రభుత్వమే అభివృద్ధి చేసే దిశగా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 2వేల ఎకరాల వరకు ఈ తరహాలో భూ సమీకరణకు అవకాశముందని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి విధానపర నిర్ణయం తీసుకొని.. భూ సమీకరణ కార్యాచరణను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ

Last Updated : Feb 19, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.