ETV Bharat / state

పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు

పేదలకు కట్టించే ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలంలో నిర్మించుకునే ఇళ్లు లక్ష సహా మొత్తం 3లక్షల 44వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 39 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్న సర్కారు... రూ. 7వేల 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. మరో లక్షా10వేల ఇళ్ల పనులు 90 శాతం పూర్తయినట్లు స్పష్టం చేసింది.

the-government-
the-government-
author img

By

Published : Mar 13, 2020, 5:31 AM IST

Updated : Mar 13, 2020, 8:12 AM IST

పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు

నిరుపేద ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది వేగంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ పద్దులపై చర్చ నేపథ్యంలో 2020- 21 ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందుంచింది.

రూ. 7వేల 494 కోట్ల ఖర్చు..

ఇప్పటివరకు 2లక్షల 83వేల 401 ఇళ్లు మంజూరు చేయగా.. అందులో లక్షా 99వేల ఒక ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. వాటిలో లక్షా 79వేల 78 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అందులో ఇప్పటి వరకు 39వేల 321 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో లక్షా 10వేల 459 ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ. 7వేల 494 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కారు తెలిపింది.

2018- 19లో రూ. 4వేల 637 కోట్లు ఖర్చు చేయగా 12వేల 530 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొంది. 2019- 20లో ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ. 3వేల132 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 17వేల 269 ఇళ్లు పూర్తయ్యాయని వివరించింది.

నిర్మాణాలు పూర్తి చేస్తాం..

2020- 21 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి పద్దు కింద గృహానిర్మాణ శాఖకు రూ. 8వేల 916 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది 3లక్షల 44వేల80 ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం చేసే లక్ష ఇళ్లు కూడా ఇందులో ఉన్నాయి. బడ్జెట్ నిధులతో పాటు హడ్కో, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం వివరించింది.

వారికి ఆర్థిక సాయం..

కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను ఉపయోగించుకొని ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే లక్ష మందికి 2020- 21లో ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం... ఇందుకు సంబంధించి విధివిధానాలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 72 వేలు ఇస్తుండగా... రాష్ట్రం రూ. 4.32 లక్షలను ఇవ్వనుంది. ఈ తరహాలో కూ. 250 కోట్ల బడ్జెట్​తో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల 479 ఇళ్లను చేపట్టనున్నారు.

పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కేంద్రం లక్షన్నర ఇస్తుండగా... రాష్ట్రం మిగిలిన రూ. 3.80 లక్షలు ఇవ్వనుంది. జీహెచ్​ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఐదున్నర లక్షలు ఇవ్వనుంది.

ఇదీ చూడండి: బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

Last Updated : Mar 13, 2020, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.