రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం.. మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1,663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- నీటి పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు
- నీటి పారుదల శాఖలో 227 ఏఈ పోస్టులు
- నీటి పారుదల శాఖలో 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
- నీటి పారుదల శాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
- భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి అనుమతి
- ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు
- ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టులు
- ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు
- ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
- ఆర్ అండ్ బీలో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
- ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
తాజా అనుమతులతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. మిగిలిన పోస్టుల భర్తీకీ అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకీ అనుమతులు ఇవ్వనున్నారు.
ఇవీ చూడండి..
ఇంజినీరింగ్ పట్టభద్రులకు తీపికబురు.. 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి