ETV Bharat / state

ట్రాఫిక్​ సమస్యకు త్వరలోనే చెక్.. త్వరితగతిన లింక్​ రోడ్ల పనులు - హైదరాబాద్​లో లింక్​రోడ్ల నిర్మాణం వార్తలు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్​ను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే ఎస్​ఆర్​డీపీ ఆధ్వర్యంలో నగరంలో పైవంతెనలు.. బైపాస్‌లు నిర్మిస్తోంది. వీటికి తోడు ప్రధాన మార్గాలను కలిపే లింక్ రోడ్లపై దృష్టి సారించింది. జంట నగరాల్లో రూ.313 కోట్లతో 44.7 కిలోమీటర్ల పొడవైన లింకురోడ్లను చేపట్టింది. పలు రోడ్లను పూర్తి చేసిన జీహెచ్​ఎంసీ వాటిని వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

The government has expedited the construction of link roads
ట్రాఫిక్​ సమస్యకు త్వరలోనే చెక్.. త్వరితగతిన లింక్​ రోడ్ల పనులు
author img

By

Published : Aug 1, 2020, 7:25 PM IST

ట్రాఫిక్​ సమస్యకు త్వరలోనే చెక్.. త్వరితగతిన లింక్​ రోడ్ల పనులు

హైదరాబాద్ జంటనగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కొత్తవేం కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో నగర ప్రయాణమంటే వాహన దారులకు ఇబ్బందులు సర్వసాధారణం. రోజూ కొత్త వాహనాల సంఖ్య పెరగడం.. సొంత వాహనాల వాడకం అధికం కావడం వల్ల రద్దీ అధికమవుతోంది. ప్రధాన రోడ్లపై ఈ సమస్య రెట్టింపవుతుంది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం లింక్ రోడ్లకు శ్రీకారం చుట్టింది. లింక్‌ రోడ్ల వల్ల జంక్షన్లలో ట్రాఫిక్ తగ్గించడంతో పాటు.. ప్రయాణ దూరం సగానికి పైగా తగ్గుతుందని అంచనా వేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​.. మేయర్ బొంతు రామ్మోహన్‌ లింక్‌రోడ్ల నిర్మాణంపై హైదరాబాద్ రోడ్‌ డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్​ (హెచ్​ఆర్​డీసీఎల్)​, జీహెచ్​ఎంసీ సంయుక్తంగా లింక్‌రోడ్లను అభివృద్ధి చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 126.2 కిలోమీటర్ల మేర లింక్​రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొదటి దశలో 44.7 కిలో మీటర్ల పనుల్లో భాగంగా.. భూసేకరణ తదితర అవసరాలకు రూ.313 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 37 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

4 లింక్​ రోడ్లు పూర్తి..

ఇప్పటికే నగరంలో 4 మిస్సింగ్ లింక్‌ రోడ్లను పూర్తి చేశారు. మియాపూర్ మెట్రో నుంచి నిజాంపేట్, అల్కాపురి టౌన్‌షిప్ నుంచి నార్సింగి.. శేరిలింగంపల్లి నుంచి చందానగర్, జూబ్లీహిల్స్-ప్రశాసన్‌నగర్ ప్రాంతాల్లో దాదాపు 4 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తిచేసి నగర వాసులకు అందుబాటులోకి తెచ్చారు.

త్వరలోనే మరిన్ని..

లింక్‌రోడ్ల కోసం బల్దియా... ఆస్తులను సేకరించి గ్రౌండ్ క్లియర్ చేస్తుండగా హెచ్​ఆర్​డీసీఎల్​ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది. మరో 19 లింక్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. మిగతా 14 రోడ్ల పనుల కోసం బల్దియా అధికారులు భూసేకరణ చేపట్టే పనిలో ఉన్నారు. పూర్తైన మరికొన్ని లింక్‌రోడ్లను ఈనెల మొదటి వారంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈనెలఖారులోగా వీలైనన్ని లింక్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

ఇదీచూడండి: తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.