జీహెచ్‌ఎంసీలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనం ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఉన్నాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... పారిశుద్ధ్య సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని తెలిపారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని అన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పనులు చేశారని ప్రశంసించారు. నిమజ్జనం కార్యక్రమంలో విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేశారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల వద్ద వ్యర్థాలు తొలగిస్తున్నామని కమిషనర్ లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?