ETV Bharat / state

'విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అయినా ఇబ్బందులు రానీయం' - జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పీచ్

Electricity consumption has increased in Telangana: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతల తీవ్రతో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది. యాసంగిలో వరి పంట పొట్ట దశలో ఉండటంతో సాగుకు గరిష్ఠంగా విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఈనెలలో కరెంట్‌ వాడకం భారీగా పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. కరెంటు సరఫరాపై ఉన్నతాధికారులు నిత్యం సమీక్షలు చేస్తున్నారు.

the
'విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అయినా ఇబ్బందులు రానీయం'
author img

By

Published : Mar 3, 2023, 8:51 AM IST

Electricity consumption has increased in Telangana: వేసవిలో కరెంట్‌ డిమాండ్‌ను ఎదుర్కొనే అంశంపై విద్యుత్‌శాఖ దృష్టిసారించింది. ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్​పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్​పీడీసీఎల్​ సీఎండీ గోపాల్ రావు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 30 శాతం, పరిశ్రమలకు 20 శాతం వరకు వినియోగం వినియోగం అవుతోందని అంచనా వేశారు. రానున్న రోజుల్లో 16 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ 300 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదయ్యే అవకాశాలున్నాయని ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.

వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం: ఎన్​టీపీసీ నుంచి ఏడాది క్రితమే విద్యుత్తు సరఫరా మొదలు కావాల్సి ఉన్నా ఇంతవరకూ అందుబాటులోకి రాలేదన్నారు. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎక్సేంజీలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. డిస్కంలకు భారమైనప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు.

విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది: రాష్ట్రంలో గత నెల 28న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటా ఒక నిమిషానికి గరిష్ఠ డిమాండ్‌ 14,794 మెగావాట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే తారీఖున 12,966 మెగావాట్లు నమోదు కాగా ఒక సంవత్సర కాలంలోనే దాదాపు 1,828 మెగావాట్ల అదనపు డిమాండ్‌ నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 27న ఒక్కరోజే 290.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ నెలలో రూ.1500కోట్లు వరకు ఖర్చు అవుతాయి: ఇప్పటికే ఫిబ్రవరి నెలలో విద్యుత్‌ ఎక్సేంజీలో కరెంట్‌ కొనుగోలు కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు అయ్యాయని అన్నారు. ఈ నెలలో ఎక్సేంజీలో విద్యుత్ కొనుగోలు చేసేందుకు రూ.1,500 కోట్లు వరకు నిధులు అవసరం అవుతాయని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.

ఫిబ్రవరి నెల(21-28)లో విద్యుత్​ వినియోగం వివరాలు:

తేది2022లో (మెగావాట్లలో) 2023లో(మెగావాట్లలో)
ఫిబ్రవరి 2111,914 14,332
2211,915 14,457
2312,378 14,526
2412,907 14,501
2513,178 14,380
2613,037 14,380
2712,671 14,595
2812,966 14,794

"రాబోయే రోజుల్లో విద్యుత్​ ఎంత అవసరం వచ్చిన వినియోగదారులకు అందరికి ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేస్తాం. నాణ్యమైన విద్యుత్​ని ఇచ్చేది మన రాష్ట్రమే. ఉచిత విద్యుత్​ కూడా అందిస్తున్నాం. ఇతర రాష్ట్రాలు సామర్థ్యం ఎక్కువే, డిమాండ్​ ఎక్కువే. నాణ్యమైన విద్యుత్​ వినియోగదారులకు అందించడంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది." - ప్రభాకర్ రావు

ట్రాన్స్‌కో - జెన్కో సీఎండీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.