ETV Bharat / state

AIR FORCE: వాయుసేనకు కీలక అస్త్రం.. అందుబాటులోకి తొలి ఎంఆర్‌సామ్‌ యూనిట్‌

వాయుసేన ఆయుధ సంపత్తి మరింత బలోపేతం అయింది. గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే మధ్యశ్రేణి క్షిపణి చేరికతో మరో బలమైన ఆయుధం చేరింది. ఇజ్రాయిల్‌తో కలిసి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను  భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ఉత్పత్తి చేస్తోంది. వాయుసేన కోసం సిద్ధం చేసిన తొలి క్షిపణి యూనిట్‌ను మంగళవారం తరలించారు.

mrsam weapon, air force weapons
వాయుసేనకు కీలక అస్త్రం, అందుబాటులోకి తొలి ఎంఆర్‌సామ్‌ యూనిట్‌
author img

By

Published : Jul 21, 2021, 8:22 AM IST

భారత వాయుసేన అమ్ములపొదిలో మరో కీలక ఆయుధం చేరింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే మధ్యశ్రేణి క్షిపణి (మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌-ఎంఆర్‌సామ్‌) చేరికతో ఆయుధ సంపత్తి మరింత బలోపేతం అయింది. ఇజ్రాయిల్‌తో కలిసి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళంలో వీటిని ప్రవేశపెట్టారు. వాయుసేన కోసం సిద్ధం చేసిన తొలి క్షిపణి యూనిట్‌ను మంగళవారం తరలించారు.

ఈ వాహనానికి హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌లో డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌(క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ జెండా ఊపి సాగనంపారు. క్షిపణుల అభివృద్ధిలో నోడల్‌ సంస్థగా వ్యవహరించిన ఆర్‌సీఐ(రీసెర్చి సెంటర్‌ ఇమారత్‌) డైరెక్టర్‌ నారాయణమూర్తి, బీడీఎల్‌ సీఎండీ కమోడోర్‌ సిద్ధార్థ్‌ మిశ్రా, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

70 కి.మీ. దూరంలోని..

ఈ క్షిపణి 70 కి.మీ. దూరంలోని లక్ష్యాలను శబ్ద వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లి ధ్వంసం చేయగలదు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ద్వారా శత్రు విమానాలు, హెలికాప్టర్లు, గైడెడ్‌ బాంబులు, క్రూజ్‌ క్షిపణులను గుర్తించి కూల్చివేస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యూయల్‌ పల్స్‌ రాకెట్‌ మోటార్‌ని ఇందులో ఉపయోగించారు.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన బెజోస్​- స్పేస్​ టూర్​ సక్సెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.