రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,84,222 మందికి తొలిడోసు టీకా ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అందులో 267 మంది హెల్త్ కేర్ వర్కర్లు, 722 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 14 నుంచి 44 మధ్య వయసున్న వారు 1,46,381 మంది, 45 ఏళ్లు పైబడిన వారు 36,852 మంది ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరో 10,308 మందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్టు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 75,08,743 మందికి తొలిడోసు, 15,58,132 మందికి రెండో డోసు టీకా పూర్తైనట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 905 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు 80,83,570 టీకాలు అందగా అందులో 80,10,344 టీకాలు వినియోగించినట్లు వెల్లడించింది. ఇక ప్రైవేటులో ఇప్పటి వరకు 10,56,531 మందికి టీకాలు ఇచ్చినట్లు పేర్కొంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?