ETV Bharat / state

రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు - తెలంగాణ వార్తలు

రష్యా స్పుత్నిక్ వి టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో ఈ టీకాలను తీసుకువచ్చారు. ఈ వ్యాక్సిన్​ను వినియోగించనున్న దేశాల్లో భారత్ 60వ స్థానంలో ఉంది.

Sputnik V vaccines from Russia arrive in Hyderabad, corona vaccine
హైదరాబాద్​లో స్పుత్నిక్ వి టీకాలు, హైదరాబాద్​లో రష్యా టీకా
author img

By

Published : May 1, 2021, 4:55 PM IST

Updated : May 1, 2021, 5:05 PM IST

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 1.5-2 లక్షల వయల్స్ తొలి విడతలో భారత్‌కు చేరుకోనున్నట్లు ఇటీవలే రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ తెలిపారు. నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావడం.. మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్పుత్నిక్‌-వి టీకాలు భారత్‌ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. దేశీయంగా స్పుత్నిక్‌-వికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన స్పుత్నిక్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌, అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌ 12న పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లు భారత్‌లో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

Last Updated : May 1, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.