ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) తమవంతు విరాళం ఇచ్చింది. సభ్యుల విరాళాలతో 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, ప్రతినిధులు ప్రగతిభవన్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి కాన్సంట్రేటర్లను అందించారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగించాలని కోరారు. సమాఖ్య కృషిని ప్రశంసించిన మంత్రి కేటీఆర్... మహమ్మారిని ఎదుర్కునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి చేతనైన సహకారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి: పల్లెప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం