How to Make Leftover Rice Jalebi: సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమయంలో అన్నం మిగిలిపోతుంటుంది. దీంతో చాలా మంది మరుసటి రోజు తాలింపు అన్నం చేసుకుని తింటుంటారు. అలాగే కొందరు అట్లు, వడలు, పకోడీలు అంటూ కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి చేసేవే. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి మిగిలిపోయిన అన్నంతో కమ్మటి జిలేబీలు ట్రై చేయండి. ఏంటీ అన్నంతో జిలేబీలా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే తీయని జిలేబీలు మీ ముందుంటాయి. ఈ జిలేబీలు చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చాలా సులభంగా త్వరగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా స్వీట్ షాప్ స్టైల్ మాదిరి ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా మిగిలిన అన్నంతో జిలేబీలు ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- అన్నం - కప్పు
- మైదా పిండి - కప్పు
- పెరుగు - అరకప్పు
- పంచదార - కప్పు
- నీరు - కప్పు
- యాలకులపొడి - పావుటీస్పూన్
- బేకింగ్ సోడా - చిటికెడు
- నూనె సరిపడా
- ఫుడ్ కలర్ - చిటికెడు
తయారీ విధానం :
- ముందుగా పాకం సిద్ధం చేసుకోవాలి. అందుకోసం గిన్నెలో పంచదార వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. జిలేబీల పాకం గులాబ్ జామున్ పాకం లాగా ఉండాలి. పాకం ఒక పొంగు రాగనే ఇందులో కొద్దిగా యాలకులపొడి కలుపుకోండి. దీనివల్ల జిలేబీలు జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి.
- ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి అన్నం, పావు కప్పు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఆపై మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో మైదా పిండి, ఫుడ్ కలర్, చిటికెడు బేకింగ్ సోడా, పావు కప్పు పెరుగు వేసుకుని చేతితో బాగా కలుపుకోండి.
- ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని అందులో మైదా పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.
- ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ కవర్ చివరన కొద్దిగా కట్ చేయాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేయండి. నూనె కాస్త వేడిగా ఉన్నప్పుడు పిండి మిశ్రమాన్ని జిలేబీలుగా నూనెలో ఒత్తుకోవాలి.
- వీటిని రెండు వైపులా దోరగా వేయించిన తర్వాత.. గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- ఎంతో రుచికరమైన క్రిస్పీ జిలేబీలు మీ ముందుంటాయి.
- ఈ రెసిపీ నచ్చితే ఓ సారి ఇలా జిలేబీలు ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
అన్నం మిగిలిపోతే ఇలా "మసాలా వడలు" ప్రిపేర్ చేసుకోండి - సూపర్ టేస్టీగా ఉంటాయి గురూ!