ETV Bharat / state

రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ - Telangana Latest News

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటోంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా పడిపోయిన ఆదాయం నెమ్మదిగా పెరుగుతోంది. అంచనా మేరకు రాకపోయినా... సెప్టెంబర్‌లో నిరుటి ఆదాయాన్ని స్వల్పంగా అధిగమించింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఆదాయం మరింతగా మెరుగుపడుతుందని సర్కార్‌ అంచనా వేస్తోంది.

రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ

author img

By

Published : Oct 23, 2020, 8:21 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, లాక్‌డౌన్ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో.... ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికి తోడు పేదలకు అందించిన ఆర్థికసాయం, కరోనా చికిత్స వ్యయం ఖజానాపై భారాన్ని పెంచింది.

క్రమంగా పెరుగుతోంది

వానాకాలం రైతుబంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ మొత్తానికి రుణాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా ఎత్తివేస్తుండటంతో... ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. సర్కార్ ఖజానాకు ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

నిరుడు కంటే బెటరే..

సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 11వేల 500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వాస్తవానికి నెలకు 15వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. అంచనా కంటే 3500 కోట్ల రూపాయలు తగ్గినప్పటికీ.....గత ఏడాదితో పోలిస్తే మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉంది. నిరుడు సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 11వేల 84 కోట్ల ఆదాయం సమకూరింది.

అయితే కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో...సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ప్రభుత్వానికి ఈ రూపంలో రావాల్సిన ఆదాయం రాలేదు. ధరణి ప్రారంభమై రిజిస్ట్రేషన్లు మొదలైతే... పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలు కూడా తొలగిస్తుండటంతో.... ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.