ETV Bharat / state

ఏపీలో పెరిగిన అప్పులు.. దాచిపెట్టేందుకు సర్కార్​ తిప్పలు - కన్సాలిడేటెడ్‌ ఫండ్‌

AP DEBTS : ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 9లక్షల కోట్ల రూపాయలను మించిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం రాష్ట్ర రుణభారం 9.16 లక్షల కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. కానీ ఏపీ అప్పులు 4లక్షల 42వేల 442 కోట్ల రూపాయలేనని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుల లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది..? నిజాలు దాచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? చేసిన ఏయే అప్పులను ప్రభుత్వం దాస్తోంది..? ఈ లెక్కల్లో లొసుగులు కనిపెట్టడానికి కాగ్‌ చేస్తున్న కసరత్తు ఏంటి..? ఈ మొత్తం వ్యవహారంపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో పెరిగిన అప్పులు

author img

By

Published : Feb 14, 2023, 10:17 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో పెరిగిన అప్పులు

Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్‌ అప్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. రుణాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలను దాస్తోంది. వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న వేల కోట్ల రుణాల తాజా గణాంకాలను అధికారికంగా వెల్లడించడం లేదు. దిల్లీ నుంచి కాగ్‌ అధికారుల బృందం ప్రత్యేకంగా రాష్ట్రానికొచ్చి కొన్నిరోజులుగా సచివాలయంలో తనిఖీలు చేస్తున్నా.. వారడిగిన లెక్కలను సమగ్రంగా అందించడం లేదు. వివరాలేవీ ఇవ్వొద్దని కిందిస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల మొత్తాన్నీ అధికారికంగా వెల్లడించడం లేదు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నిజమైన ఆర్థికభారం తేలడం లేదు.

Andhra Pradesh Debts latest : రాష్ట్ర ఆర్థికశాఖలో గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, కొందరు నిపుణులు, వివిధ అధికారిక వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తే.. ఏపీపై ప్రస్తుతమున్న రుణభారం 9 లక్షల 16వేల 696 కోట్ల రూపాయలుగా తేలుతోంది. కానీ, 2023 మార్చి నెలాఖరుకు ఏపీ రుణాలు 4 లక్షల 42వేల 442 కోట్లుగా.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు.

Andhra Pradesh Debts update : అయితే.. "స్టేట్‌ ఫైనాన్సెస్‌: ఏ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ 2022-23” పేరిట ఆర్​బీఐ ప్రచురించిన పుస్తకంలోని గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు.. రాజ్యసభలో ఇచ్చిన అధికారిక పత్రాల్లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి స్పష్టంచేశారు. తాము పేర్కొన్న ప్రతి లెక్కకూ.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో ప్రతిపాదించిన, సవరించిన గణాంకాలే ఆధారమని ఆయా పుస్తకాల్లో ఆర్​బీఐ పేర్కొంది. అంటే.. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినా, తన వెబ్‌సైట్‌లో ఆర్​బీఐ చూపినా.. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే. రాష్ట్రం అనేక అప్పులను దాచిపెడుతూ, బయటకు చెబుతున్న లెక్కలను మాత్రమే ఆర్​బీఐ, కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతోనే.. అప్పుల లెక్కల్లో ఇంత తేడా వస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం సహజంగా బహిరంగ మార్కెట్, పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి రుణాలు సమీకరిస్తుంది. బహిరంగ మార్కెట్‌ రుణాలను కేంద్ర ఆర్థికశాఖ అనుమతుల మేరకు ఆర్​బీఐ నిర్వహించే వేలం ద్వారా సేకరిస్తుంది. అందువల్లే బహిరంగ మార్కెట్‌ రుణం ఎంతనేది ఆర్​బీఐకి స్పష్టంగా తెలుస్తుంది. పబ్లిక్‌ అకౌంట్‌ రుణాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తాయి. ఈ పద్దులో ఉద్యోగుల నుంచి వివిధ మార్గాల్లో తీసుకునే మొత్తాలు, కార్పొరేషన్ల ద్వారా సమీకరించే రుణాలు కలిసి ఉంటాయి. ఉద్యోగుల పీఎఫ్​, ఏపీజీఎల్​ఐ వంటివి, కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చే రుణాలను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయరు.

కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేసే మొత్తంలో నుంచి ఖర్చు చేయాలంటే.. చట్టసభల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే పబ్లిక్‌ అకౌంట్‌ కింద పీడీ ఖాతాల్లో ఉంచే సొమ్ముల బదలాయింపును.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా చేయవచ్చు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలు కూడా గతంలో బ్యాంకు ఖాతాల్లో ఉండేవి. ఆ తర్వాత కాలంలో వాటిని పీడీ ఖాతాల్లో ఉంచి ప్రభుత్వం వినియోగించుకుంటోంది. అందువల్లే ఈ అప్పుల వివరాలను రాష్ట్రం సమగ్రంగా బయటకు వెల్లడించడం లేదు. దీనివల్ల అసలు అప్పుల స్వరూపం తెలియడం లేదు.

రాష్ట్ర తాజా అప్పుల అంచనా :

అప్పుల సేకరణ వివరాలు రూపాయలలో
రాష్ట్ర ప్రభుత్వ రుణం 4,65,860 కోట్లు
కార్పొరేషన్ల రుణం 1,78,603 కోట్లు
నాన్‌ గ్యారంటీ అప్పులు 87,233 కోట్లు
పెండింగు బిల్లులు 1,85,000 కోట్లు
మొత్తం 9,16,696 కోట్లు

ఇక 2022 మార్చి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కాగ్‌ వాటిని ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వ అంచనాలు, సవరించిన అంచానాలకు.. గతంలో ఆ తర్వాత తేలిన వాస్తవ అంకెలను పోల్చి చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్​, ఏపీజీఎల్​ఐ ఇలా తీసుకునే రుణాల మొత్తం సమగ్రంగా లెక్కించకపోవడం, వాటిని యథాతథంగా బయటపెట్టకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. ఇప్పటికే జీపీఎఫ్​ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య వివాదం సాగుతున్న విషయమూ తెలిసిందే.

కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను, చెల్లిస్తున్న మొత్తాలను కూడా ప్రభుత్వం సమగ్రంగా బయటపెట్టడం లేదు. కార్పొరేషన్ల అప్పులపై వివరాలు అడుగుతున్నా.. ఆ గణాంకాలేవీ వెల్లడించడం లేదని నెలవారీ నివేదికల్లో కాగ్‌ స్పష్టంచేస్తోంది. రుణాలన్నీ పారదర్శకంగా తీసుకుని ఖర్చు చేస్తే.. వాటి వివరాలు, గణాంకాలను కాగ్‌కు ఎందుకు సమర్పించడం లేదన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వివరాలను దాచిపెడుతోందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదు. నాన్‌ గ్యారంటీ రుణాలను కూడా... మొత్తం రుణాల లెక్కల్లో కలిపి చూపడం లేదు.

నాలుగేళ్లుగా ప్రభుత్వం అనేక బిల్లులు చెల్లించకుండా పెండింగులో ఉంచింది. ఈ బకాయిలు గత మూడేళ్లలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా. తదుపరి బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ వాటిని చేర్చడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 35 వేల కోట్ల రూపాయల వరకు పెండింగు బిల్లులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏనాడూ పెండింగు బిల్లుల మొత్తం బయటకు వెల్లడించడం లేదు. ఎప్పటికప్పుడు ఆ లెక్కలు మారిపోతుంటాయని చెప్పడం తప్ప.. ఒక నిర్దుష్ట సమయానికి ఎన్ని పెండింగు బిల్లులు ఉన్నాయో కూడా చెప్పడం లేదు. వీటిపై హైకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. ఇన్ని రహస్యాల మధ్య రాష్ట్రం ఆర్​బీఐకి చెప్పే లెక్కలు, ఆ నివేదిక ఆధారంగా కేంద్రం వెల్లడించే లెక్కల్లోని అసలు వాస్తవాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.