ETV Bharat / state

మేమూ నేరుగా పంటల్ని కొంటాం: మార్కెటింగ్​శాఖ

కొత్త వ్యవసాయ చట్టాలతో కోల్పోయే ఆదాయాన్ని రాబట్టుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ మరో మార్గాన్ని ఎంచుకుంది. వ్యవసాయ మార్కెట్ల ఉద్యోగులతోనే నేరుగా వ్యాపారం చేయించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమేంటీ? కొనుగోలు ఎలా చేస్తుందనే విషయాలను తెలుసుకోండి.

The decision of the agricultural marketing department to buy the crop yield
మేమూ నేరుగా పంటల్ని కొంటాం: మార్కెటింగ్​శాఖ
author img

By

Published : Oct 28, 2020, 7:25 AM IST

ఇంతకాలం వ్యవసాయ మార్కెట్లు కేవలం పంటల క్రయ, విక్రయాలకు ఒక వేదికలా మాత్రమే ఉన్నాయి. ఇకపై వ్యాపారి మాదిరిగా రైతుల నుంచి పంటను కొని మరో ప్రభుత్వ సంస్థకు దాన్ని అప్పగించి కమీషన్‌ తీసుకోవాలని ఆ శాఖ వ్యూహం రచించింది. గత నెలాఖరు వరకూ పంటలు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ వ్యవసాయ మార్కెట్ల ద్వారా మార్కెట్‌ రుసుం వసూలు చేసేవి.

కొత్త చట్టాల ప్రకారం వ్యాపారులు మార్కెటింగ్‌ శాఖకు ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ రుసుం ద్వారా గతేడాది (2019-20) రూ.355 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ కొత్త చట్టాలతో రూ. 200 కోట్ల దాకా మార్కెట్లు ఆదాయం కోల్పోతాయని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేస్తోంది. అందుకే సొంత వనరులతోనే ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగానే రైతులు మార్కెట్‌కు తెచ్చిన పంటలను మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగుల ద్వారానే కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారుల మాదిరిగా కొనుగోలు చేయించాలనేది ఒక వ్యూహం. ఇంతకాలం మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగులు పంటల కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం సక్రమంగా జరిగేలా చూసేవారు.

ఎలా కొంటారంటే...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి నేరుగా కొంటున్నాయి. ఉదాహరణకు వరి ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, కందులు, మినుములు, పెసలు, సోయాచిక్కుడు, వేరుసెనగ తదితర పంటలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’ (నాఫెడ్‌) కొంటున్నాయి.

గ్రామాల్లోకి వెళ్లి రైతుల నుంచి కొనేందుకు ఇతర ఏజెన్సీలను వినియోగిస్తున్నాయి. రైతుల నుంచి కొని తిరిగి అప్పగించినందుకు గాను వాటికి కొంత కమీషన్‌ చెల్లిస్తాయి. ఉదాహరణకు వరి ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ తరఫున మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్‌) రైతుల నుంచి కొని తిరిగి పౌరసరఫరాల సంస్థకు అప్పగించి కమీషన్‌ తీసుకుంటున్నాయి.

ఈ సీజన్‌ నుంచి వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి తమ ఉద్యోగుల ద్వారా కొని తిరిగి అప్పగిస్తామని దానిపై ఇతర సంఘాలకిచ్చినట్లే కమీషన్‌ ఇవ్వాలని మార్కెటింగ్‌ శాఖ కోరింది. దీనికి ప్రభుత్వం తాజాగా అనుమతించింది. ప్రయోగాత్మకంగా తొలిసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర పంటలు కొంటామని రాష్ట్ర మార్కెటింగ్‌ సంచాలకురాలు లక్ష్మీభాయి చెప్పారు.

ఇదీ చూడండి: తెలంగాణ సర్కార్.. రైతు పక్షపాత ప్రభుత్వం : మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.