ETV Bharat / state

'గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి' - గోమాత

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శివ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్​తో నవంబర్ 5 నుంచి 7 వరకు హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు నిర్వహించే పాదయాత్ర... సన్నాహక సమావేశాన్ని లక్డికాపుల్​లోని ఓ హోటల్​లో నిర్వహించారు.

The cow should be declared a national animal: shivakumar
'గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి'
author img

By

Published : Oct 28, 2020, 5:02 PM IST

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 నుంచి 7 వరకు హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర నిర్వహిస్తామని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శివ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్​ లక్డికాపుల్​లోని ఓ హోటల్​లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్వామీజీలు , గో ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్ష గోవుల గోశాల పెట్టాలన్నది తన లక్ష్యమని... ఈ లక్ష గోవులు కోసం స్థలం కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని శివ కుమార్ తెలిపారు. ఆవులు అంతరించిపోకముందే మనమే వాటిని రక్షించుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఈ సమయంలో రాజకీయాలు వెతక్కండి: సబితా ఇంద్రారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.