ETV Bharat / state

MLA Shankar Nayak: తెరాస ఎమ్మెల్యేపై కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు - మహబూబాబాద్ జిల్లా వార్తలు

మహిళ కలెక్టర్​తో అనుచితంగా ప్రవర్తించారంటూ మహబూబాబాద్ శాసనసభ్యుడు బి.శంకర్ నాయక్​పై నమోదైన కేసు ప్రజా ప్రతినిధుల కోర్టులో వీగిపోయింది. ఛార్జ్ షీట్​పై విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. పోలీసులు అభియోగాలను తగిన ఆధారాలతో రుజువు చేయనందున.. ఎమ్మెల్యేపై కేసును కొట్టివేసింది.

mla
mla
author img

By

Published : Nov 1, 2021, 9:55 PM IST

మహిళ కలెక్టర్​తో అనుచితంగా ప్రవర్తించారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్​పై నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2017లో హరితహారం కార్యక్రమం జరుగుతుండగా అప్పటి కలెక్టర్ ప్రీతిమీనా పట్ల శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించార్న ఆరోపణలు వచ్చాయి. ఆమె ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పోలీసులు శాసనసభ్యుడి​పై కేసు నమోదు చేసి.. ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఛార్జ్ షీట్​పై ఇవాళ తీర్పు వెల్లడించింది. పోలీసులు అభియోగాలను తగిన ఆధారాలతో రుజువు చేయనందున.. శంకర్ నాయక్​పై కేసును కొట్టివేసింది.

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్నారెడ్డిపై గతేడాది నమోదయిన రెండు కేసులు వీగిపోయాయి. నామినేషన్ సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని వనపర్తిలో నమోదైన కేసులను కొట్టివేసింది. అనుమతి లేకుండా కార్యకర్తల సమావేశం నిర్వహించారని పెబ్బేరులో నమోదైన కేసులను సైతం వీగిపోయింది.

అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై నమోదైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కూడా ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ సందర్భంగా పరిమితికి మించి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని అశ్వరావుపేట పోలీసులు నమోదు చేసిన కేసు వీగిపోయింది.

ఇదీ చదవండి: Venkaiah Naidu: క్రమశిక్షణ లేని వ్యక్తి... ఎప్పటికీ నాయకుడు కాలేడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.