కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ఇండియా అమెరికా లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ సీఎం ఇండియాకు పీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సేవా మండలి నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న దివ్యాంగులకు తినిపించారు. ట్రైసైకిళ్లను పంపిణి చేశారు.
అనంతరం కేసీఆర్ సేవా మండలి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ!